×
Login

నారాయణఖేడ్ లో దారుణం.....14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం........

0 Comments । By Black Cat News । 11 June, 2022

నారాయణఖేడ్ లో దారుణం.....14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం.......

తెలంగాణ లో మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. చిన్న పిల్లలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి. మానవ సంబంధాలు కరువై పోతున్నాయి. గత పది రోజులుగా ఎక్కడో ఓక చోట మైనర్ బాలికపై అత్యాచారాలు జరగటం కలవరాన్ని పెంచుతోంది. జూబ్లీ హిల్స్,సికింద్రాబాద్,ఎల్బీనగర్ ఘటనలను మరవకముందే తాజాగా నారాయణఖేడ్లో మరో ఉదంతం కలవరానికి గురి చేసింది. 

నారాయణఖేడ్‌లో ఓ యువకుడు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. నారాయణఖేడ్ మండల పరిధిలోని ఓ 14ఏళ్ళ మైనర్ బాలిక ఈ నెల 6న మిస్సింగ్ అయ్యింది. దీనితో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ కాంటాక్ట్ వివరాల ఆధారంగా విచారించగా.. అమ్మాయికి మాయమాటలు చెప్పి నమ్లిమేట్‌కు చెందిన నవీన్(18) అనే యువకుడు నాలుగైదుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించి ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అమ్మాయిని కుటుంబీకులకు అప్పగించి, నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ శ్రీరామ్, సీఐ రామకృష్ణ రెడ్డి, ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు. 

Santosh Kumar 's Report
BlackCatNews, Medak



#

Also Read

×