యువతి వేధింపులు.. ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు యువకులు.. అసలేం జరిగిందంటే...
0 Comments । By Black Cat News । 10 August, 2023
అబ్బాయి వేధింపులతో అమ్మాయి ఆత్మహత్య చేసుకోవటం ఇప్పటి వరకు చూశాం. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. రొటీన్‌కు భిన్నంగా ఇక్కడ ఓ అమ్మాయి వేధింపులతో ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ షాకింగ్ ఘటన ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విస్సన్నపేటకు చెందిన మనోహర్‌కు ఫేస్ బుక్ ద్వారా మరో గ్రామానికి చెందిన ప్రియాంక అనే అమ్మాయి పరిచయం అయ్యింది. అయితే, ఏమైందో ఏమో గానీ ఏడాది కాలంగా ఆమెను దూరం పెట్టాడు మనోహర్. దాంతో అతనితో యువతి గొడవపడటం ప్రారంభించింది. ఇద్దరి మధ్య పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా అయ్యింది. అప్పటి పంచాయతీలో అయితే పెళ్ళి చేసుకోవాలని, లేదంటే రూ. 20 లక్షలు ఇవ్వాలని ప్రియాంక డిమాండ్ చేసింది. అయితే, అంత పెద్ద మొత్తం ఇవ్వలేక 75 వేలు ఇస్తానని చెప్పాడు మనోహర్. దాంతో ప్రియాంక అతనిపై కేస్ పెట్టగా.. 80 రోజులు జైల్లో శిక్ష అనుభవించాడు.
ఇక జైలు నుండి వచ్చాక కూడా ప్రియాంక వేధింపులు ఆగలేదని, కావాలని మనోహర్ అన్న నరేష్‌ను కూడా వేధిస్తూ అతనిపై కూడా ఎస్సి ,ఎస్టీ అట్రాసిటీ కేస్ పెట్టిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అప్పటి నుండి ఓ వైపు పోలీసులు.. మరోవైపు ప్రియాంక వేధింపులు మరింత ఎక్కువయ్యాయని, వీరి వేధింపులు తాళలేక శుక్రవారం సాయంత్రం వీరిద్దరూ గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అన్నదమ్ములు ఇద్దరి పరిస్థితి విషమించడంతో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
అబ్బాయి ఓసి, అమ్మాయి ఎస్సీ కావటంతో పోలీసులు కూడా మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని, విచారణ పేరుతో పోలీసులు తరచూ స్టేషన్‌కు పిలిచి టార్చర్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు మనోహర్, నరేష్ తల్లితండ్రులు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మనోహర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, నరేష్ పరిస్థితి మాత్రం విషమంగా ఉందని చెబుతున్నారు వైద్యులు. ప్రియాంక మాత్రం తనకెలాంటి సంబంధం లేదని, తాను వేధించడం లేదని చెబుతోంది.
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, East Godavari