తప్పుడు కేసులు పెడితే ఏం చేయాలి.. చట్టం కల్పించే హక్కులు ఏంటంటే...
0 Comments । By Black Cat News । 19 May, 2024
ఏ నేరం చేయకున్నా, ఏ తప్పూ చేయకున్నా కొందరు తప్పుడు కేసులకు బలి అవుతుంటారు. సమాజంలో ఇలాంటి పరిస్థితులు చాలాసార్లు ఎదుర్కొన్ సందర్భాలు ఉన్నాయి. తప్పు చేయకపోయినా నేరారోపణ చేస్తారు. దానివల్ల చాలా ఇబ్బంది పడి, పరువు పోగొట్టుకున్నవారూ ఉన్నారు.
ఏ నేరం చేయకున్నా, ఏ తప్పూ చేయకున్నా కొందరు తప్పుడు కేసులకు బలి అవుతుంటారు. సమాజంలో ఇలాంటి పరిస్థితులు చాలాసార్లు ఎదుర్కొన్ సందర్భాలు ఉన్నాయి. తప్పు చేయకపోయినా నేరారోపణ చేస్తారు. దానివల్ల చాలా ఇబ్బంది పడి, పరువు పోగొట్టుకున్నవారూ ఉన్నారు. కొంతమంది ఓర్వలేక, ఎదుగుదలను తట్టుకోలేక ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టాలని, హాని చేయాలని.. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తుంటారు. మరి.. తప్పుడు కేసులు పెడితే, అలాంటి ఆరోపణల నుంచి ఎలా బయటపడాలి? చట్టం ఎలాంటి రక్షణ కల్పిస్తోంది? అంటే.. తప్పుడు కేసులు పెట్టిన వ్యక్తి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 211 ప్రకారం శిక్షార్హులు అవుతారు.
ఉదాహరణకు కొట్టకుండానే కొట్టాడని.. గాయపరచక ముందే గాయం చేశారని.. బెదిరించక ముందే బెదిరించారని.. దూషించకముందే దూషించారని.. ఎలాంటి నేరం చేయకముందే నేరం చేశారని తప్పుడు కేసు వేస్తే ఆరోపణలు చేసిన వ్యక్తికి 2 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేదా.. రెండూ పడే అవకాశం ఉంది. తీవ్రమైన నేరారోపణ అంటే.. మర్డర్, అత్యాచారయత్నం, తీవ్రమైన గాయం చేయడం లాంటి అబద్ధపు ఆరోపణలకు 7 సంవత్సరాల వరకు శిక్ష పడొచ్చు.
తప్పుడు ఆరోపణలు చేస్తే ఏం చేయాలంటే..
1. శాంతంగా ఉండాలి : తప్పుడు ఆరోపణలు ఎదురైతే శాంతంగా ఉండాలి. కోపంగా ప్రతిస్పందిస్తే మనం తప్పు చేసినవాళ్లం అవుతాం.
2. న్యాయవాదిని నియమించుకోండి: నేరారోపణలు ఎదురైతే చట్టపరమైన ప్రాతినిథ్యం అవసరం. అంటే.. న్యాయవాది ద్వారా ఆ ఆరోపణలను ఎదుర్కోవాలి. పరువు నష్టం దావా వేసి నిందితుడి నుంచి పరిహారం పొందవచ్చు.
3. ఆధారాలు సేకరించాలి: పత్రికలు, ఈమెయిల్స్, ఫొటోలు, వీడియోలు, సోషల్ మీడియా పోస్ట్‌లు వంటి సాక్ష్యాలను సేకరిస్తే చాలా మంచిది. వీటిని మీ నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి, తప్పుడు ఆరోపణలను కించపరచడానికి ఉపయోగించుకోవచ్చు.
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Krishna