వనమూలికా మహోత్సవంగా ఆచార్య బాలకృష్ణ జయంతి...............
0 Comments । By Black Cat News । 7 August, 2023
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తి సంస్థల కార్యనిర్వాహక అధ్యక్షులు, యోగ మరియు వేద ఆయుర్వేద లలో అత్యంత కఠినమైన పరిశోధనలు చేసి, హిమాలయ పర్వత శ్రేణులలో సంచరించి, ఎన్నో ఆయుర్వేద వనమూలికల ను ప్రపంచానికి పరిచయం చేసిన, ఆరోగ్య భారతావని కోసం విశేషమైన కృషి చేస్తున్న/ చేసిన నారాయణ ప్రసాద్ సుబేది ఆచార్య బాలకృష్ణ గా ప్రసిద్ధినొందారని, ప్రభుత్వ ప్రభుత్వ సంస్థల నుండి విశేషమైన విశిష్టమైన అవార్డులు బిరుదులు పొందారని, పతంజలి విశ్వవిద్యాలయం, యోగ సందేశ్ వంటి పత్రికలను స్థాపించారని, భారతీయ యోగఋషి బాబా రామ్ దేవ్ సహాధ్యాయిగా ప్రపంచానికి యోగ ఆయుర్వేదం అత్యంత ఆవశ్యకమని చాటి చెప్పిన ఆచార్య బాలకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా పతంజలి యోగా పీఠ్, భారత స్వాభిమానం ట్రస్ట్ ఆధ్వర్యంలో వనమూలికల మొక్కలను స్థానిక యోగా కేంద్రం రామచంద్రమిషన్ ఆశ్రమ ప్రాంగణములో నాటారు.
ఈ సందర్భముగా యోగాచార్య గంధవళ్ల బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ జూలై 15 నుండి ఆగస్ట్ 15 వరకు పతంజలి యోగ, భారతస్వాభిమాన్ ట్రస్ట్ వారు పతంజలి వృక్షారోపణ్ మాసోత్సవాలు నిర్వహిస్తున్నారని, ఆయా కార్యక్రమాలలో భాగంగా ఆచార్య బాలకృష్ణ జన్మదినము ఆగస్ట్ 4, శుక్రవారం వనమూలికల మొక్కలు నాటి “వనమూలికా మహోత్సవం” , ఆరోగ్య, వృక్ష ప్రేమికులకు వనమూలికల మొక్కలు పంపిణిచేసి “వనమూలిక వితరణోత్సవం” నిర్వహించామని తెలిపారు. ఎన్నో రకాలైన అనారోగ్యాలకు యోగ, ఆయుర్వేద మొక్కలు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయని కనుక ప్రతి ఒక్కరు యోగ సాధన తో పాటు వనమూలికల మొక్కలను నాటి పర్యావరణాన్ని తద్వారా ఆరోగ్యాన్ని పొందాలని విజ్ఞప్తి చేశారు. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మహిళా పతంజలి సమితి యువభారత్ కిసాన్ పంచాయత్ సభ్యులు పాల్గొన్నారు.
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Chittoor