జూన్ 26న లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవాలి, ప్రజలు జాతీయ లోక్ అదాలత్ను .
0 Comments । By Black Cat News । 10 June, 2022
జాతీయ లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి యస్. శశిధర్ రెడ్డి
జూన్ 10: జాతీయ న్యాయాధికారి సేవా సంస్థ న్యూఢిల్లీ, రాష్ట్ర న్యాయ అధికార సేవా సంస్థ ఆదేశాల మేరకు జూన్ 26వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించాలని జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో న్యాయవాదులతో సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ ,శశిధర్ రెడ్డి సమావేశంలో సూచించారు. ప్రజలు జాతీయ లోక్ అదాలత్ లో సామరస్య ధోరణితో భూతగాదాలు, బ్యాంకు రికవరీ కేసులు ,వివిధ కేసుల పై న్యాయ స్థానాల చుట్టూ తిరగకుండా సామరస్య ధోరణితో జాతీయ లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారం చేసుకోవాలని సూచించారు.జాతీయ లోక్ అదాలత్ నందు న్యాయవాదులు వారి కేసులు పరిష్కరం చేసుకోవాలని కోరారు. జాతీయ లోక్ అదాలత్ నిర్వహణలో నిర్వహించిన సమావేశంలో జిల్లా న్యాయాధికారి సేవా సంస్థ కార్యదర్శి శ్రీమతి సిహెచ్. ఆశాలత, మూడవ అదనపు న్యాయమూర్తి పి, రాజు, సీనియర్ సివిల్ న్యాయమూర్తి బి. పుష్పలత, బార్ అధ్యక్షులు శ్రీ.విష్ణువర్ధన్ రెడ్డి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
Santosh Kumar 's Report
BlackCatNews, Medak