నాపై బుల్లెట్ల వర్షం కురిపించండి..కానీ ఆ స్కూల్‌ను కూల్చకండి.
0 Comments । By Black Cat News । 26 August, 2024
హైడ్రా కూల్చివేతలు అక్రమణ దారుల గుండెల్లో రైళ్లు పరుగెస్తున్న వేళ మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం రాత్రి పాతబస్తీలోని ఒవైసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మట్లాడుతూ బండ్లగూడలో గల ఫాతిమా ఓవైసీ కాలేజీని కూడా హైడ్రా కూల్చివేస్తుందన్న ప్రచారంపై ఆయన స్పందించారు.
” కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి. ఆ స్కూల్‌ను కూల్చకండి. పేదలకు ఉచిత విద్య అందించేందుకు 12 బిల్డింగులు నిర్మించాం. 40 వేల మంది విద్యార్థులకు ఉచితవిద్యతో విద్యార్థులకు మంచి భవిష్యత్ అందిస్తున్నాం.
పేద విద్యార్థుల ఆ పాఠశాల వరం లాంటిది” అని స్పష్టం చేశారు. ఇది ఓర్వలేని కొందరు అసూయ పడుతున్నారని, కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అక్బరుద్దీన్ ఆరోపించారు. పేదల విద్యాభివద్ధికి చేస్తున్న కషి అడ్డుకోకూడదని విన్నవించారు.
నాతో శత్రుత్వం ఉంటే రండి తుపాకీలతో కాల్చి నన్ను చంపేయండి. కానీ నేను చేసే మంచి పనిని మాత్రం నాశనం చేయొద్దు అని ఆయన భాబోద్వేగంతో విజ్ఞప్తి చేశారు..
నాకు శక్తి లేక కాదు…
నేను బతిమిలాడుతున్నానంటే నాకు శత్రువులతో పోరాడే శక్తి లేక కాదు. నాపై దాడి జరిగింది. నా శరీర భాగంలో అన్ని గాయాలు ఉన్నాయి. అక్బరుద్దీన్ ఒవైసీ శత్రువులకు వెన్ను చూపే వ్యక్తి కాదు అని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయ వైరంతో తాము నిర్మించిన స్కూల్ కూల్చాలని కోరడం సరికాదని, వేలాది మంది విద్యాబుద్దులు నేర్చుకునే స్కూల్ నేలమట్టం అయితే వారి బంగారు భవిష్యత్ నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నానన్నారు.
మా విద్యా సంస్థలను ఒకవేళ కూల్చినా కుతుబ్‌మినార్ కంటే ఎతైన భవనాలు నిర్మిస్తామని, నాపై కక్ష ఉంటే నన్ను కాల్చండి.. నాపై దాడులు చేయండి. నేను చేస్తున్న మంచి కార్యక్రమాలను మాత్రం అడ్డుకోవద్దు అని ఆయన పునరుద్ఘాటించారు..
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Hyderabad