సీఎం జగన్ పై సీఈవోకు ఫిర్యాదు చేసిన జనసేన నేతలు. .
0 Comments । By Black Cat News । 19 April, 2024
ఏపీ సీఎం జగన్ పై జనసేన నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న భీమవరం సభలో పవన్ కల్యాణ్ పై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారని ఆరోపించారు.
జగన్ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందికే వస్తాయని వారు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మహిళలను కించపరిచేలా జగన్ మాట్లాడారని జనసేన నేతలు తమ ఫిర్యాదులో వివరించారు. సానుభూతితో గెలిచేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని సీఈవో దృష్టికి తీసుకెళ్లారు.
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Krishna