పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారు.
0 Comments । By Black Cat News । 18 April, 2024
జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండడం తెలిసిందే. రాష్ట్రంలో ఇవాళ నామినేషన్ల పర్వానికి తెరలేచిన నేపథ్యంలో, పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 23న పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
పిఠాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి పవన్ కల్యాణ్ స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పిస్తారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అదే రోజు సాయంత్రం కాకినాడ జిల్లా ఉప్పాడలో జరిగే బహిరంగ సభకు జనసేనాని హాజరవుతారని వివరించింది
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, East Godavari