×
Login

ఆ పార్టీలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి - హరిశ్ రావు.

0 Comments । By Black Cat News । 10 June, 2022

 ఆ పార్టీలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి - హరిశ్ రావు

తెలంగాణ ప్రజల గుండె చప్పుడు టీఆర్ఎస్ అని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణానికి చెందిన వివిధ పార్టీ నాయకులు శుక్రవారం టీఆర్ఎస్‌లో చేరారు. వీరికి మంత్రి హరీష్ రావు గులాబీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ మభ్యపెట్టె ప్రయత్నాలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. ఒకరు పాదయాత్ర.. మరొకరు మోకాళ్ళ యాత్ర చేస్తూన్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు కాపీ కొట్టి కేంద్ర పథకాలుగా ఫేక్ ప్రచారం చేస్తుందన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసిన.. ఎన్ని మోకాళ్ళ యాత్రలు చేసిన తెలంగాణ ప్రజలు ఆ రెండు పార్టీలను విశ్వసించరన్నారు.

దేశంలోనే దళిత సంక్షేమానికి కృషి చేసిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. 75 ఏండ్లలో ఏ ప్రభుత్వం చేయని విధంగా దళితుల సంక్షేమం కోసం దళిత ఎంపోర్ మెంట్ పథకం, దళిత బంధు పథకాలను అమలు చేస్తూ దళితుల అభ్యన్నతికి పాటు పడుతున్నారన్నారు. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ కార్పోరేషన్ ద్వారా చేయూతనందిస్తున్నట్లు తెలిపారు. మద్యం షాపుల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. దళితులకు ఆర్థిక చేయూతనందించే ఏకైక ప్రభుత్వం సీఎం కేసీఆర్ సారధ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. ప్రజల కోరుకునే అభివృద్ధి సంక్షేమం ప్రజల కళ్ళ ముందు ఉందని చెప్పారు. సిద్దిపేట అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కార్యకర్తకు టీఆర్ఎస్‌లో సముచిత స్థానం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, సాకి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


Santosh Kumar 's Report
BlackCatNews, Medak



#

Also Read

×