×
Login

కోటక్ మహీంద్రా బ్యాంకుకు RBI షాక్‌ .

0 Comments । By Black Cat News । 24 April, 2024

కోటక్ మహీంద్రా బ్యాంకుకు RBI షాక్‌

కోటక్‌ మహీంద్రా బ్యాంకుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా. డేటా సెక్యూరిటీ సమస్యలతో పాటు ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ లోపభూయిష్టంగా ఉన్నట్లు గుర్తించిన RBI..కోటక్‌ మహీంద్రా ఆన్‌లైన్ సేవలపై ఆంక్షలు విధించింది. కొత్త ఖాతాలు ఓపెన్ చేయొద్దని, క్రెడిట్ కార్డుల జారీని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఐతే ఇప్పటికే ఉన్న కస్టమర్లకు యథావిధిగా సేవలు కొనసాగించుకోవచ్చని సూచించింది. బ్యాంకింగ్ రెగ్యూలేషన్ యాక్ట్‌-1949 సెక్షన్ 35A కింద అధికారాలను ఉపయోగించి కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌పై ఆంక్షలు విధించింది. దీని ప్రకారం ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడంతో పాటు కొత్త క్రెడిట్ కార్డుల జారీని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
2022, 2023 సంవత్సర కాలంలో కస్టమర్ల నుంచి ఉత్పన్నమైన సమస్యలు, ఆందోళనలు పరిష్కరించడంలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్ వరుసగా ఫెయిల్ కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు RBI స్పష్టం చేసింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ తన డేటాను భద్రపరిచే విధానంలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు పేర్కొంది RBI.

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Krishna




Also Read

×