రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రచార విభాగం తెలంగాణ ప్రముఖ్ అమర్నాథ్ రెడ్డి.
0 Comments । By Black Cat News । 2 April, 2022

*హిందూ సంఘటన మే ఆర్ఎస్ఎస్ లక్ష్యం*
*రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రచార విభాగం తెలంగాణ ప్రముఖ్ అమర్నాథ్ రెడ్డి*
ఖమ్మం : నగరంలో ఉగాదిని పురస్కరించుకుని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆధ్వర్యంలో మమత హాస్పిటల్ రోడ్ ఈ.ఆర్.ఆర్ గార్డెన్ నుండి ఎన్.ఎస్.పి . రామాలయం వరకు గణ వేష్ ధరించి వందలాది మంది స్వయంసేవక్లతో రూట్ మార్చి ( పథసంచలనo ) నిర్వహించారు . ఈ రూట్ మార్చిలో ఆర్.ఎస్.ఎస్.స్వయంసేవికా సమితి మహిళలు మరియు స్వయం సేవకులు పూల వర్షంతో దారి పొడుగునా స్వాగతం పలికారు . అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రచార విభాగం తెలంగాణ ప్రముఖ్ అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ సుశిక్షితులైన క్రమశిక్షణతో కూడిన లక్షాలాది స్వయం సేవకులు భారతదేశ పూర్వ వైభవంకు పాటుపడాలని సూచించారు .ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా విభాగ్ సంఘ చాలక్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు .
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Khammam