×
Login

మొహర్రం వేడుకల్లో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని కమ్మరచేడు గ్రామంలో ఘర్షణ.

0 Comments । By Black Cat News । 3 August, 2023

మొహర్రం వేడుకల్లో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని కమ్మరచేడు గ్రామంలో ఘర్షణ

మొహర్రం వేడుకల్లో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని కమ్మరచేడు గ్రామంలో అలాయి ఆడుతూ ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో రెండు వర్గాలకు చెందిన 10 మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా విషమంగా ఉంది. శుక్రవారం రాత్రి గ్రామానికి చెందిన రెండు వర్గాలు పీర్ల చావిడి దగ్గర అలాయి ఆడుతుండగా.. ఒకరికొకరు కాలు తగిలిందని వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఒక వర్గం వారు కర్రలతో దాడులకు పాల్పడగా.. మరో వర్గం వారు మండుతున్న కట్టెలతో ఎదురుదాడికి దిగారు. అక్కడే బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ వారిని ఆపే ప్రయత్నం చేసినా ఫలించలేదు. గ్రామస్థుల సహకారంతో రెండు వర్గాలను అక్కడి నుంచి ఇళ్లకు పంపించేశారు. ప్రస్తుతం గ్రామంలో పికెట్ కొనసాగుతోంది. ఘర్షణలో గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Kurnool



#

Also Read

×