వైసీపీ ప్రచార రథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు చనిపోయాడు.....
0 Comments । By Black Cat News । 19 April, 2024
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతి చెందడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి 108 అంబులెన్స్ రాక, బాలుడిని సకాలంలో ఆసుపత్రికి తీసుకు వెళ్లలేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. కన్ను మిన్ను కానరాక ప్రచార రథాన్ని నిర్లక్ష్యంగా నడిపారని... ఇదొక నిర్లక్ష్యం అయితే... అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ ను అందించలేని వైసీపీ పాలన నిర్లక్ష్యం మరొకటని మండిపడ్డారు. ఈ రెండు నిర్లక్ష్యాలు ఎంతో భవిష్యత్తు ఉన్న పసివాడి జీవితాన్ని బలి తీసుకున్నాయని చెప్పారు. భరద్వాజ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. హాస్పిటల్ లో చిన్నారికి చెందిన వీడియోను షేర్ చేశారు.
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Vizianagaram