×
Login

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలాసోర్‌లోని పట్టాలు తప్పింది.

0 Comments । By Black Cat News । 3 June, 2023

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలాసోర్‌లోని పట్టాలు తప్పింది

*షాలిమార్ - చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలాసోర్‌లోని బహనాగా స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది.*


ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. షాలిమార్ - చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలాసోర్‌లోని బహనాగా స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. 7 బోగీలు పట్టాలు తప్పిన ఈ ప్రమాదంలో పలువురు రైలు ప్రయాణికులు గాయపడ్డారు. కోల్‌కతా నుంచి చెన్నై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది. ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సమాచారం.తక్షణమే ఘటనా స్థలానికి చేరుకోవాలని రాష్ట్ర మంత్రి ప్రమీలా మల్లిక్‌, స్పెషల్‌ రిలీఫ్‌ కమిషనర్‌ (ఎస్‌ఆర్‌సీ)ని ఒడిశా సీఎం ఆదేశించారు.  ఒడిశా ప్రత్యేక రిలీఫ్ కమీషనర్ (SRC), సీనియర్ అధికారులు హేమంత్ శర్మ, బల్వంత్ సింగ్, అరవింద్ అగర్వాల్, అగ్నిమాపక సేవల డీజీతో పాటు సహాయక కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తాజా రైలు ప్రమాదంతో బాలాసోర్ జిల్లా, చుట్టుపక్కల ఉన్న మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను అలర్ట్ చేశారు అధికారులు. ప్రస్తుతానికి మూడు ఎన్టీఆర్ఎఫ్ టీమ్ లు, నాలుగు ODRAF టీమ్స్ సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు.


50 మంది మృతి,380 మంది బాలసోర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం


CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Balasore




Also Read

×