×
Login

అరే ఏంట్రా ఇది.. బిల్డింగ్ ఎక్కిన ఆంబోతు.. మరి ఇప్పుడు దించేది ఎలా.?.

0 Comments । By Black Cat News । 3 August, 2023

అరే ఏంట్రా ఇది.. బిల్డింగ్ ఎక్కిన ఆంబోతు.. మరి ఇప్పుడు దించేది ఎలా.?

పక్షులు ఆకాశంలో ఎగిరితే జంతువులు నేల మీద నడుస్తాయి. ఇందులో చెప్పటానికి, చెప్పుకోవటానికి విశేషం, విశేషణం ఏమి లేదు. కాని చిరుతపులి చెట్లు ఎక్కగలదు. కాని భారీ కాయమున్న ఒక ఎద్దు చెట్టు కాదు ఏకంగా ఇళ్లు ఎక్కటం మీరు అనుకుంటున్నారా.. ఏంటి ఆంబోతు ఇళ్లు ఎక్కడం ఏంటి ఎలా సాధ్యం అనుకుంటున్నారా… అవును.. మీరు చదువుతున్నది నిజం. సహజంగా ఆవులు, ఎద్దులు, పశువులు ఇలాంటి కొండలు, గుట్టలు ఎక్కటం , దిగటం వాటికి అలవాటే. పూర్వం నుంచి పల్లె ల్లో దున్నలు, ఎద్దులను బండికి కట్టి రవాణాకు, ప్రయాణాలకు వినియోగించేవారు. కాని కాలం మారిపోయింది ఇపుడు ఎద్దుల బండి ప్రయాణాలు అరుదుగా మారిపోయాయి.

ఇక ఆంబోతులు, ఆవులను వంటి వాటిని పోషించటమే భారంగా భావిస్తున్నారు పెంపకం దారులు. ఇలా వాటిని పోషించలేక ఊరి మేదకు వదిలి వేస్తున్నారు. అలాంటివి ఇపుడు చాలా సిటీల్లో రోడ్లపై కనిపిస్తుంటాయి. రోడ్డుకు అడ్డంగా ఉన్న వీటిని స్పీడ్ బ్రేకర్లంటూ వాహనచోదకులు కామెంట్ చేస్తుంటారు

పూర్వం బందుల దొడ్లు ఉండేవి….
గ్రామాల్లో పూర్వం చాలా కట్టుబాట్లు ఉండేవి. ఆలయాలు కోసం కొందరు ఆవులను దానం చేసేవారు. ఆంబోతులను సైతం గుడికే ఇచ్చే వారు..ఇలాంటి వాటిని భక్తితో కొలిచి, ఆయా గ్రామాల వాళ్లు ఆహారం , నీళ్లు అందించేవాళ్లు. ఇవి కాకుండా ప్రజలకు సంబంధించిన పశువులు, ఇతర జంతువుల ఇష్టానుసారం రోడ్లపై తిరిగినా వాటి యజమానికి సంబంధించిన పొలాలు కాకుండా ఇతరులు చేలల్లోకి వెళ్లి మేసినా పంచాయితీ సిబ్బంది లేదా పంట నష్టపోయిన బాదితులు వాటిని బందులదొడ్లో కొట్టేసే వాళ్లు. వాటికి సంబంధించిన వాళ్లు వచ్చి తగిన పరిహారం చెల్లించి తమ పశువులను తీసుకుని వెళ్లటం జరిగేది ఇపుడు అలాంటి చోటు లేకుండా పోయింది. దీంతో రోడ్లే ఆవాసాలు గా చాలా జంతువులు బ్రతికేస్తున్నాయి.

బిల్డింగ్ ఎక్కిన ఆంబోతు
చలి, ఎండ, వర్షం వీటిని తట్టుకోవడానికి మనుషులకు ఇళ్లు, వాకిళ్లు ఉన్నాయి. ఇక యజమానులున్న పశువులు వాటికి సంబంధించిన గొడ్లచావిడిలో ఉంటాయి. కాని అనాధలుగా మారిన జంతువులు పరిస్థితి ఏంటి..? పశ్చిమగోదావరి జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై నీరు, చల్లగాలులతో కనీసం వీధి ఆవులు, జంతువులు పడుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో పాలకొల్లు రామగుండం సెంటర్లో కోర్టు ఎదుట బిల్డింగ్ లోకి ఒక పెద్ద ఆంబోతు వెళ్లింది. వర్షం పడుతుండటం, మెట్లు గేటు తీసే ఉండటంతో ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఫస్ట్ ఫ్లోర్ కి చేరుకుంది. కారిడార్ లోకి వెళ్లాక దానికి ముందు దారి కనిపించలేదు. వెనక్కి దిగటానికి శరీరం సహకరించలేదు.

బిల్డింగ్ ఎక్కిన ఆంబోతు
చలి, ఎండ, వర్షం వీటిని తట్టుకోవడానికి మనుషులకు ఇళ్లు, వాకిళ్లు ఉన్నాయి. ఇక యజమానులున్న పశువులు వాటికి సంబంధించిన గొడ్లచావిడిలో ఉంటాయి. కాని అనాధలుగా మారిన జంతువులు పరిస్థితి ఏంటి..? పశ్చిమగోదావరి జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై నీరు, చల్లగాలులతో కనీసం వీధి ఆవులు, జంతువులు పడుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో పాలకొల్లు రామగుండం సెంటర్లో కోర్టు ఎదుట బిల్డింగ్ లోకి ఒక పెద్ద ఆంబోతు వెళ్లింది. వర్షం పడుతుండటం, మెట్లు గేటు తీసే ఉండటంతో ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఫస్ట్ ఫ్లోర్ కి చేరుకుంది. కారిడార్ లోకి వెళ్లాక దానికి ముందు దారి కనిపించలేదు. వెనక్కి దిగటానికి శరీరం సహకరించలేదు.

దీంతో దాదాపుగా 12 గంటలు అలాగే నిలబడి పోయింది. ఒకవైపు బయట జోరు వాన, చలి గాలులు, ఆహారం నీళ్లు లేకుండా అలా నిలబడే ఉండిపోయింది. సహజంగా రోడ్లపై తిరిగే మూగ జీవాలకు మార్కెట్ లో షాప్ యజమానులు, స్థానికులు మిగిలిన కూరగాయలు , అరటి పండ్లు పెడుతుంటారు. వాటిని తిని రోడ్లు పక్కన ఉన్న చెట్ల కింద ఖాళీ ప్రదేశాల్లో సేద తీరుతూ ఉంటాయి. అయితే చెట్లను ఇష్టానుసారంగా కొట్టివేయడంతో మూగజీవాలకు నిలువ నీడ లేకుండా పోతుంది. మూగజీవాలకు నీడ లేకపోవడంతో అనేక జాతులు అంతరించిపోవడం మరికొన్ని జంతువులు చనిపోవడం జరుగుతుంది.

గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మూగజీవాలు విలవిలాడుతున్నాయి విశ్రమించడానికి చోటు లేక వర్షంలో తడుస్తూ నానా ఇబ్బందులకు గురవుతున్నాయి. దీంతోనే ఈ వీధి ఆంబోతు మూడు అంతస్తుల బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ ఎక్కింది. ఎక్కడమైతే నాలుగు అడుగుల వెడల్పు ఉన్న మెట్ల గుండా 50 మెట్లు ఎక్కేసింది కానీ దిగడానికి ఆ ఆంబోతు కు మార్గం లేకపోవడం, తిరగడానికి చోటు లేక అలానే రాత్రి నుండి బిల్డింగ్ పై ఫ్లోర్ లో నుంచుని ఉండిపోయింది.

ఉదయం బిల్డింగ్ పై ఉన్న ఆంబోతు చూసిన స్థానికులు క్రిందకి దిగలేక నుంచుని ఉండిపోయిందని గమనించి స్థానిక యానిమల్ వారియర్ కన్జర్వెన్సీ సోసైటీ అధ్యక్షుడు మనీష్ కు చెప్పారు . దీంతో ఆ ఆయన ఆ ప్రదేశానికి వచ్చి కిందకు దింపాలని ప్రయత్నించినా కుదరలేదు. అక్కడే ఉన్న గదుల తాళాలు తెప్పించి వాటి తలుపులు తీసి అతి కష్టం మీద జాగ్రత్తగా పై ఫ్లోర్ నుండి కిందకి మెట్లు గుండా దింపారు. యానిమల్ వారియర్స్ ఆంబోతును సురక్షితంగా కిందకు దింపడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు

అయితే ఒక ఆంబోతు కష్టంలో ఉంటే చాలా మంది జాలి పడ్డారు..కొందరు కాపాడేందుకు ప్రయత్నించారు. కాని ఇలాంటి పరిస్థితి వీటికి ఎందుకు కలుగింది అని ఆలోచిస్తే మూగజీవాలకు రక్షణ లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఒకపుడు రైతు తన రెండు ఎద్దులతో ఫోటో దిగి ఫ్రేం కట్టించుకుని ఇంటి గుమ్మం ముందు అందరికి కనపడేలా ఉంచేవాడు కాని ఇపుడు అవే ఎద్దులు మనిషికి భారంగా మారటం ఆశ్చర్యమే..!

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Krishna



#

Also Read

×